పుల్కల్, అక్టోబర్ 2: సంగారెడ్డి జిల్లాలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. ప్రాజెక్టు అధికారులు ఎప్పటిక ప్పుడు నీటి హెచ్చుతగ్గులను గమనిస్తూ నీటి ని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవా రం ఉన్నట్టుండి వరద తీవ్రత పెరగడంతోప్రాజెక్టు క్రస్ట్ గేటు 2 మీటర్లు ఎత్తి 10,734 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశా రు.
విద్యుత్ ఉత్పత్తి కోసం జన్కోకు 2,822 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 7,263 క్యూసెక్కులు వస్తుండగా, అవుట్ ఫ్లో 13,556 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్‌రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 29.917 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.