Air storm | వెల్దుర్తి, మార్చ్ 22 : శుక్రవారం రాత్రి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వీచిన గాలిదుమారం మండలంలోని బండపోసాన్‌పల్లి, శెట్పల్లి గ్రామాలలో బీభత్సం సృష్టించింది. గాలి దుమారం ధాటికి గ్రామాల్లోని పలువురి నివాస ఇండ్లపై కప్పు రేకులు ఎగిరిపోవడంతోపాటు పెద్ద చెట్లు నేలవాలగా, విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.
బండపోసాన్‌పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి నుంది ఇవాళ (శనివారం)మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది గ్రామస్తులు, పంచాయతీ కార్మికుల సహాయంలో చెట్లకొమ్మలను తొలగించి, తీగలు సరిచేసి విద్యుత్‌ను పునురుద్దరించారు.
అలాగే శెట్పల్లిలో వ్యవసాయ పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్తంభం విరిగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బండపోసాన్పల్లితోపాటు మండలంలోని పలు గ్రామాల్లో మామిడికాయలు భారీగా రాలిపోయాయి.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు