సిద్దిపేట, ఏప్రిల్ 5: అందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరామచంద్రుడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.శనివారం శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ‘హకుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం! కష్టంలో కలిసి నడవాలన్నది సీతతత్వం’ అని పేర్కొన్నారు.
శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారన్నారు. శ్రీరాముడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మానవ అవతారమూర్తులైన సీతారాములు ధర్మసంస్థాపనకు నిలువుటద్దంగా నిలిచారన్నారు. శ్రీరాముడి అనుగ్రహంతో జిల్లా అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధించాలని, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు హరీశ్‌రావు ప్రకటనలో పేర్కొన్నారు.