చిన్నకోడూరు, ఏప్రిల్ 21: సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలోని గంగాపూర్‌లో నిర్వహిస్తు న్న పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని అమ్మవారిని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలతో మనం చేసే కార్యం సఫలం కావాలని, గంగాపూర్ ప్రజలకు అన్నింటా శుభం చేకూరాలన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. ముదిరాజ్ సంఘ ప్రతినిధులు, గ్రామస్తులు హరీశ్‌రావును సన్మానించారు.