పటాన్చెరు టౌన్, జూలై 11: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నేడు ఉదయం ఎస్ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ బీఎల్ఏకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు స్థ్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా డిప్యూటీ ఫ్ల్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం ముత్తంగి ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు ఎస్ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, బీఎల్ఏలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకావాలని ఎమ్మెల్యే కోరారు.