కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్ద ఎత్తున పటాకులు కాల్చి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్‌రెడ్డి, సీనియర్ నాయకులు సోమిరెడ్డి తదితరులు హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికారు. హరీశ్‌రావు స్పీచ్ కొనసాగినంత సేపు జై బీఆర్ఎస్, జైజై కేసీఆర్ నినాదాలు మార్మోగాయి. హరీశ్‌రావు మాటలకు జనం ఫిదా అయ్యారు. హిందీ, తెలుగు భాష వచ్చినవారందరికీ అర్థం అయ్యేలా హరీశ్‌రావు సంభాషణ కొనసాగింది. ప్రభుత్వంపై హరీశ్‌రావు చేసిన విమర్శలకు చప్పట్లతో జనం సందడి చేశారు.
సభ ప్రాంగణంలో కేసీఆర్ పాటలను, దేఖ్లేంగే పాటను ప్రజలు మళ్లీ మళ్లీ పెట్టించుకుని డ్యాన్స్‌లు చేశారు. మిరుమిట్లు గొలిపే వెలుగుల మధ్య కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం ప్రాంగణం గులాబీమయంగా మారింది. ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. హరీశ్‌రావుతో సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తి చూపించారు.
కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్యకమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపూరం శివకుమార్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్, బీఆర్ఎస్ తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్‌యాదవ్, నాయకులు సోమిరెడ్డి, బాల్‌రెడ్డి, గూడెం మధుసూదన్‌రెడ్డి, రాములుగౌడ్, గడీల శ్రీకాంత్‌గౌడ్, ఐలాపూర్ మాణిక్‌యాదవ్, తోట అంజయ్య, బాబ్జీ, రవీందర్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సాగర్, ఇంద్రారెడ్డి, నర్సింహ, ఉమేశ్, మేరాజ్‌ఖాన్, కొమురయ్య, రవీందర్‌రెడ్డి, నాగరాజు, శ్రీశైలం, దయాకర్‌రెడ్డి, అజీముద్దీన్, షకిల్, షేక్‌అబ్దుల్ రషీద్, కొల్లూర్ 2బీహెచ్‌కే ఇన్చార్జిలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నిర్వాహకులు పాల్గొన్నారు.