అక్కన్నపేట, నవంబర్ 20: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రైతు రిక్కల శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల కురిసిన మొంథా తుపానుతో పంటనష్టం జరిగి ఆత్మైస్థెర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. రైతు రిక్కల శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యపై గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరాతీసినట్లు మృతుడి కుటుంబీకులు తెలిపారు. మృతుడి కుమారుడు సాయికిరణ్‌రెడ్డితో ఆయన ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు వెల్లడించారు. కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభు త్వం నుంచి సాయం అందేలా కృషిచేస్తామని హరీశ్‌రావు భరోసా ఇచ్చినట్లు తెలిపారు.
సిద్దిపేట జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గురువారం రైతు రిక్కల శ్రీనివాస్‌రెడ్డి పొలాన్ని మండల వ్యవసాయ అధికారి తస్ల్లీమా సుల్తానా, ఏఈవో శ్రీలత మరోసారి పరిశీలించా రు. చుట్టుపక్కల రైతులను పిలిచి విచారణ చేపట్టారు. రైతు శ్రీనివాస్‌రెడ్డి పంటనష్టం వివరాలు ఆన్లైన్లో నమోదు చేశామని తెలిపారు. నిబంధనల ప్రకారమే నష్టం అంచనావేసి నమోదు చేశామన్నారు. శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన వ్యవసాయ భూమి, సాగు చేసిన పంటలు, పంటనష్టం తదితర వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు తెలిపారు. రామవరంలో రైతు ఆత్మహత్య ఘటనపై మండల వ్యవసాయ అధికారులను బాధ్యులను చేసి జిల్లా అధికారులు మెమో జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించగా, వీరు మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు.