సిద్దిపేట,అక్టోబర్ 1: గౌతమ బుద్ధుడి బోధనలు అనుసరించి అంబేదర్ దేశ దశ దిశ మార్చేలా రాజ్యాంగాన్ని రచించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం అంబేద్కర్ విగ్రహానిక ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఊపి మహారాష్ట్ర నాగపూర్‌లో జరిగే దీక్ష భూమి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ దేశ రాజ్యాంగాన్ని రచించి అందరి నోట అందరివాడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అంబేదర్ అన్నారు. అంబేదర్ అడుగుజాడల్లో అందరూ నడవాలని అనుకుంటామన్నారు. గౌతమ బుద్ధుడి నుంచి అంబేదర్ ప్రేరణ పొందారన్నారు. ప్రశాంతమైన జీవనంతో పాటు దుఃఖాల నుంచి విముక్తి పొందడమే లక్ష్యంగా బుద్ధుడి బోధనలు ఉంటాయన్నారు.
నేటి యాంత్రిక జీవనానికి బుద్ధుడి ధర్మ సూత్రాలు అవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల పైచిలుకు మంది నేడు బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నారంటే అతిశయోక్తి కాదన్నారు. బుద్ధుడి సూత్రాలు కూడా ప్రజల్లో జ్ఞానోదయం కలిగించి వారిని మంచి సమాజం వైపు మేలొలిపేలా చేయడమేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద బుద్ధవనం ఏర్పాటు చేసి గౌతమ బుద్ధుడికి ఘనమైన గౌరవం కల్పించిందన్నారు. ఎకడా లేని విధంగా బుద్ధవనానికి చైర్మన్‌ను నియమించడమే కాకుండా ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేశామన్నారు. సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టుకున్నామన్నారు.
సచివాలయం పకనే ఎతె్తైన అంబేదర్ విగ్రహాన్ని నిర్మించుకున్నామన్నారు. బుద్ధుడి బోధన.. అంబేదర్ ఆలోచన నేటి సమాజానికి అవసరమన్నారు. సిద్దిపేటలో బుద్ధవనం ఏర్పాటు చేయాలని ఆలోచన నాకు ఉంది. ఒకొకటిగా అన్ని చేసుకున్నామన్నారు. ఈలోపు ప్రభుత్వ మారింది. రేపు మళ్లీ మనమే అధికారంలోకి వచ్చాక అద్భుతమైన బుద్ధవనం సిద్దిపేటలో నిర్మించుకుందామన్నారు. సిద్దిపేటలో చేపట్టిన అన్ని పనులు ఎలాగైతే ఆదర్శంగా ఉన్నాయో మన బుద్ధవనం కూడా అదే విధంగా ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుకుందామన్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆరోజుల్లోనే అంబేదర్ ఐదులక్షల మందితో సభ నిర్వహించి దీక్ష భూమిని స్థాపించారని, ప్రతి విజయదశమి సందర్భంగా అకడ బుద్ధుడి ఉత్సవాలు జరుపుకొంటారన్నారు. అకడికి మీరు వేసే ప్రతి అడుగు అంబేదర్ గౌతమ బుద్ధుడి ఆశయాల సాధన దిశగా కొనసాగడం మన సిద్దిపేటకు గర్వకారణమన్నారు. అంబేదర్ వారసత్వానికి, జీవనానికి ఈ దీక్ష భూమి ఒక సజీవ సాక్ష్యంగా మారిందన్నారు. జ్ఞానోదయానికి ఊతంగా బౌద్ధమతం నిలుస్తున్నదన్నారు. అందుకే ప్రపంచంలో అతిపెద్ద మతాల్లో బౌద్ధమతాన్ని కూడా నేడు ప్రజలు ఆరాధిస్తున్నారని తెలిపారు.