సదాశివపేట, ఏప్రిల్ 20 : ఆధ్యాత్మిక సేవలో ఆర్యవైశ్యులు ముందుంటారని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని వాసవీ కన్యాకపరమేశ్వరి మందిరంలో దిడిగె శంకర్‌గుప్తా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సుహాసిని పూజకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి ఆయన హాజరయ్యారు.
అనంతరం ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు దిడిగె నగేశ్ హరీశ్‌రావును శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు అంజయ్య, వైశ్య సంఘం అధ్యక్షుడు మాశెట్టి ప్రకాశం, ఆలయ సంఘం అధ్యక్షుడు సాయిరాజు, సభ్యులు శ్రీనివాస్, శంకర్, మల్లేశం, వంశీ, సుధాకర్, రాజయ్య, భిక్షపతి, వినోద్, రమేశ్, కృష్ణ, చంద్రయ్య, పురం రజినీ, సుజాత, శ్రీదేవి, లక్ష్మి, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.