సిద్దిపేట, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వినూత్న ఆలోచనలతో వైద్యరంగానికి నూతనోత్తేజం తీసుకొస్తున్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కేసీఆర్ కిట్టు సూపర్ హిైట్టెంది. గర్భం దాల్చిన మహిళలు ఏ సమయంలో ఏ మందులు వేసుకోవాలో సూచించడంతో పాటు ప్రసవం జరిగే వరకు (బిడ్డకు తొమ్మిది నెలల వరకు) జాగ్రత్తలు తీసుకోవాలని “అభినందనలతో ” అనే లేఖను పంపుతున్నారు. సిద్దిపేటజిల్లాలో దీనికి శ్రీకారం చుట్టారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు ఆ లేఖను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవెర్గు మంజులారాజనర్సు, స్థానిక కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్‌తో కలిసి ఆవిష్కరించారు.
గర్భిణుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పథకం “కేసీఆర్ కిట్” సూపర్ హిైట్టెంది. ప్రభుత్వ దవాఖానలో మొదటి, రెండో కాన్పు జరిగిన వారికి ప్రసవం తర్వాత రెండు వేల విలువ చేసే 16 రకాల వస్తువులు ఉండే కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. కేసీఆర్ కిట్ పథకం కింద ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన వారికి ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగ పిల్లవాడు పుడితే రూ.12 వేల నగదు నాలుగు విడతలుగా అందిస్తున్నారు. గర్భం దాల్చిన ఐదు నెలల్లోపు రెండు ఏఎన్సీ చెకప్‌లు చేయించుకున్నైట్లెతే రూ.3 వేలు, ప్రభుత్వ దవాఖానలో డెలివరీ అయితే ఆడపిల్ల పుడితే రూ.5 వేలు, మగ పిల్లవాడు పుడితే రూ.4 వేలు-మూడున్నర నెలల్లో పిల్లలకి ఇమ్యూనైజేషన్ టీకాలు తీసుకున్నైట్లెతే రూ.2 వేలు, తొమ్మిది నెలల పిల్లలకు ఇమ్యూనైజేషన్ టీకాలు తీసుకున్నైట్లెతే రూ. 3వేలు తల్లి బ్యాంకు అకౌంట్లో వేస్తారు. ప్రభుత్వ దవాఖానకు ప్రసవం కోసం వచ్చిన తల్లి, సహాయకులకు దవాఖానలో ఉన్నంత వరకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తారు.
(ఏఎన్సీ (ప్రొఫైల్) 12 వారాల తర్వాత ) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన (TD HUB) తెలంగాణ డయాగ్నోస్టిక్ హాల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. రక్త పరీక్షలు చేయించుకున్న తర్వాత హిమోగ్లోబిన్ శాతం 9-12 గ్రా. లోపు ఉంటే రోజుకు ఐరన్ ట్యాబ్లెట్లు ఒక మాత్ర చొప్పున, 7-9 గ్రా ॥ మధ్యన ఉంటే రోజుకు రెండు మాత్రల చొప్పున, 7 గ్రా ॥ కన్న తక్కువ ఉంటే ఇంజక్షన్ ఐరన్ సుక్రోజ్, Blood Transfusion ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా చేయబడును. 5 నెలలు నిండిన తర్వాత టిఫా స్కానింగ్ చేయించుకోవాలి. 28 -30 వారాలలోపు గైనకాలజిస్టుచే మూడో చెకప్ చేయించుకోవాలి. 34-36 వారాలలోపు నాలుగో చెకప్ గైనకాలజిస్టుచే చేయించుకోవాలి. ప్రభుత్వ దవాఖానలో అన్ని చెకప్‌ల కోసం 102 వాహనాన్ని ఉపయోగించుకోవాలి. ఇందులో గర్భిణితో పాటు సహాయకురాలిగా ఆశ కార్యకర్త ఉంటుంది.
దవాఖానలో చేరిన తర్వాత ఆపరేషన్ కోసం, ముహూర్తాల కోసం వైద్యులను ఒత్తిడి చేయరాదు. సాధారణ కాన్పు కోసం నిరీక్షించండి. ప్రసవం అనంతరం మీ బిడ్డకు గంటలోపు ముర్రుపాలు తాగించాలి. (ముర్రుపాలు అమృతంతో సమానం). బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు పోలియో చుక్కలు, హైపటైటిస్, బీబీసీజీ టీకాలు ఇప్పించాలి. బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రతినెలా మీ గ్రామంలో జరిగే పోషణ, ఆరోగ్యదినం రోజు మీ బిడ్డ ఎదుగుదల, బరువు, పరీక్షలు వివరాలు ఏఎన్ఎం, అంగన్వాడీ కేంద్రం వద్ద చెక్ చేయించుకోవాలి. పుట్టిన రోజు నుంచి ఆరు వారాల వరకు రోజూ కనీసం 8-12సార్లు బిడ్డకు పాలు పట్టించాలి. మీ గ్రామంలోని ఏఎన్ఎం వద్ద ఆరు వారాలు, పది వారాలు, 14 వారాల టీకాలు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇప్పించాలి.
హెల్ప్‌డెస్క్ జీజీహెచ్ సిద్దిపేట సెల్ నంబర్: 8919110031
పీహెచ్సీ దుబ్బాక సెల్ నంబర్: 9032942902
డీహెచ్ గజ్వేల్ సెల్ నెంబర్: 7780133454
ఆరు నెలల వరకు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించవలెను. ఏడో నెల నుంచి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం తినిపించవలెను.అనారోగ్యంతో ఉన్న నెలలోపు వయస్సు ఉన్న నవజాత శిశువుల కోసం గజ్వేల్, సిద్దిపేట ప్రభుత్వ దవాఖానల్లో శిశు సంరక్షణ కేంద్రాలు (SCU) ఉన్నాయి. బరువు తక్కువగా జన్మించిన శిశువులకు అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న కంగారు మదర్ సేవలు ఉపయోగించుకోవలెను. స్థానిక ఆశకార్యకర్తతో పాటు మెడికల్ అధికారి, ఏఎన్ఎం, డిప్యూటీ డీఎంహెచ్‌వో సెల్ నంబర్‌ను గర్భిణులకు ఇస్తున్నారు.