సిద్దిపేట, డిసెంబర్ 31: కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, మీ అందరికీ మంచి జరగాలని ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రా వు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరంలో ప్రతిఒకరి ఇంటా సం తోషాలు వెల్లివిరియాలని, ప్రతిఒకరూ ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు ఎంచుకొని వాటిని చేరుకునేలా ప్రణాళికతో ముందుకు సాగాలని కోరారు. మీరు ఏర్పర్చుకున్న లక్ష్యాలను వచ్చే ఏడాది నాటికి చేరుకునేలా శ్రమించాలన్నారు.. 2024 సంవత్సరానికి వీడోలు పలుకుతూ, 2025లోకి అడుగుపెడుతున్న వేళ అందరికీ శుభం కలగాలని కోరుకుం టూ ప్రజలందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు.