సిద్దిపేట, మార్చి 16: నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సల్మా నేహాను ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందించారు. ఆదివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో హరీశ్‌రావును ఆమె కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. గతంలో తాము కిరాయి ఇంట్లో ఉండే వాళ్లమని, దీంతో చదువుకు, ఇంటి అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీశ్‌రావు సార్ డబుల్ బెడ్రూం మంజూరు చేయడంతో తమ కుటుంబానికి ధీమా ఏర్పడిందన్నారు. ఎలాగైనా ఉన్నత స్థానానికి చేరుకోవాలని లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగాలు రాసినట్లు తెలిపారు. శేరుపల్లిలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ సూల్ 2024లో గురుకుల టీచర్ ఉద్యోగం రాగా, రెండో ఉద్యోగం లాంగ్వేజ్ పండిట్‌గా ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు.
మూడో ఉద్యోగం సూల్ అసిస్టెంట్ దౌల్తాబాద్ మండలం ముబారాస్పూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో వచ్చిందన్నారు. నాలుగోది జూనియర్ లెక్చరర్‌గా 2025 మార్చి 13లో ఉద్యోగం హన్మకొండలో వచ్చినట్లు సల్మానేహా తెలిపారు. తన విజయాలకు హరీశ్‌రావు స్ఫూర్తి అని ఆమె పేర్కొన్నారు. మంచిగా చదివి నలుగురికి ఆదర్శంగా నిలవాలన్న మాటలను సల్మా నేహా నిజం చేసిందని హరీశ్‌రావు అభినందించారు.భర్త మెకానిక్ కావడంతో భర్త కష్టం చూసి, కుటుంబ పరిస్థితి చూసి తపనతో కష్టపడి చదివి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందని హరీశ్‌రావు మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సతరించారు.