జగదేవపూర్ సెప్టెంబర్ 6: ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి మాతృమూర్తి వజ్రమ్మ(90) గురువారం రాత్రి అనారోగ్యం తో మృతిచెందింది. ఆమె అంత్యక్రియలు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని దౌలాపూర్‌లో నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు శనివారం వారి స్వగృ హం దౌలాపూర్ చేరుకొని వజ్రమ్మ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
అనంతరం ఆమె కుమారులు వంటేరు సంజీవరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఏఎంసీ గజ్వేల్ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ గుండారంగారెడ్డి, కొండపోచమ్మ దేవాలయ మాజీ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, చాట్లపల్లి మాజీ సర్పంచ్ రాచర్ల నరేశ్, బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, నర్రజయపాల్రెడ్డి, బాల్‌రెడ్డి, గజ్వేల్ నాయకులు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.