మెదక్ మున్సిపాలిటీ, జూన్ 3: నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే నాయకుడు.. జన హృదయ నేత హరీశ్‌రావు అని మాజీ డిప్యూటీ స్పీకర్,బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బర్త్‌డే వేడుకలు బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని సాయిబాలాజీ గార్డెన్లో పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి, మాజీ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, న్యాయవాది జీవన్‌రావు తదితర పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. అంతకు ముందు మెగా రక్తదాన శిబిరాన్ని పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ జెండా చేతబట్టినప్పటి నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి హరీశ్‌రావు అని కొనియాడారు. ప్రజాసేవే ధ్యేయంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారం కోసం తపనపడే నాయకుడు హరీశ్‌రావు అన్నారు. ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడిని కోరారు.
హరీశ్‌రావు బర్త్‌డేను పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువకులకు పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ ప్రభుత్వ దవాఖానలో రక్తం కొరత ఉండడంతో హరీశ్‌రావు బర్త్‌డే పురస్కరించుకొని మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. సేకరించిన రక్తా న్ని మెదక్ రక్తనిధి ద్వారా పేదలకు అందుబాటులో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దీపక్, మాజీ కౌన్సిలర్లు రబ్బీ, మల్లేశం, ఆర్కె శ్రీనివాస్, చంద్రకళ, బీఆర్ఎస్ నాయకులు కృష్ణగౌడ్, లింగారెడ్డి, ప్రభురెడ్డి, సోములు, గంగా నరేందర్, బాలగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, అంజాగౌడ్, మహేశ్, ప్రతాప్‌రెడ్డి, చంద్రమోహన్‌గౌడ్, ఆంజనేయులు, నవీన్, కిరణ్, నరేశ్, అరుణ్, రంజిత్, ప్రసాద్, సర్పంచ్‌లు, చంద్రకళ, మాజీ సర్పంచ్‌లు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.