శతమానం భవతి
మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు బర్త్‌డేను బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సదాశివపేట, సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే భారీకేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
- ఘనంగా హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలు
- కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్నదానం
- ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 3: మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు బర్త్‌డేను బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సదాశివపేట, సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే భారీకేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని చింతా ప్రభాకర్ ప్రారంభించారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ హరీశ్‌రావు సమర్థవంతమైన నాయకుడని కొనియాడారు. అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై అదే స్థాయిలో స్పందిస్తూ పనిచేసే గొప్ప నాయకుడని పేర్కొన్నారు. ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, మాజీ జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, మాజీ సీడీసీ చైర్మన్లు విజయేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ శ్రీహరి, చింతా సాయినాథ్, వేణుగోపాలస్వామి, కౌన్సిలర్లు, పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హరీశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే
మాజీ మంత్రి హరీశ్‌రావు బర్త్‌డేను పురస్కరించుకొని బుధవారం బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

