వర్ధిల్లు వందేండ్లు
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు.
- ఘనంగా హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలు
- ప్రజా నాయకుడికి సబ్బండ వర్గాల ఆశీర్వాదం
- గ్రామ గ్రామాన విస్తృతంగా సేవా కార్యక్రమాలు
- పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు, అన్నదానాలు
- దవాఖానల్లో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ
- దేవాలయాల్లో పూజలు
- మసీదు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
- ఉమ్మడి మెదక్ జిల్లాలో పండుగ వాతావరణం
సిద్దిపేట, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆలయాల్లో పూజలు చేశారు.

మసీదు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. నిత్యం అభివృద్ధి, పేదల సంక్షేమానికి పాటుపడుతున్న హరీశ్‌రావుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అందరూ దేవుడిని మొక్కుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిసి పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.

వివిధ కారణాలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మృతిచెందిన నలుగురు బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఎఫ్డీ బాండ్లు అందజేసి అండగా నిలిచారు. మర్కూక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల టెన్త్‌లో ఉత్తీర్ణత పొందిన 18 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పన నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

