విజయ దశమి ( దసరా ) పర్వదినం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రజలకు అన్నింటా శుభం చేకూరాలని, జీవితంలో దసరాను మించిన పండుగ లేదన్నారు. దసరా పం డుగలో మన సంప్రదాయం,సంస్కృతితో పాటు ఆత్మీయత ఉందని,ఈ పర్వదినాన్ని ప్రజలందురూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు.
చెడు ఎంత శక్తివంతం గా కనిపిస్తున్నప్పటికీ మంచితనమే చివరికి విజయం సాధిస్తుంది, ఇదే దసరా మనకి గుర్తుచేస్తుందన్నారు. చెడు మీద మంచి విజయం సాధించే రోజు విజయ దశమి అని, పాలపిట్టను చూస్తే శుభం కలిగినట్లే ప్రజలకు శుభం కలగాలని, అమ్మవారి ఆశీస్సులు, ప్రజల దీవెన ఎల్లప్పుడూ ఉండాలని, దసరా ప్రజలందరికీ మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు.