మెదక్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): గుండె శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న నర్సాపూర్ మాజీ ఎమ్మె ల్యే చిలుముల మదన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం మాజీ మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా మదన్‌రెడ్డి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.