పాపన్నపేట, ఆగస్టు 7:రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎప్పు డు తమ బాస్ నుంచి ఫోన్ వస్తుందోనని భయం భయంగా కా లం వెళ్లదీస్తున్నారు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పంచాయతీ కార్యదర్శులు. ఇటీవల ఎంపీవో లక్ష్మీకాంతరెడ్డి బదిలీపై వెళ్లారు. ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వేణుగోపాల్‌కు ఇన్చార్జి ఎంపీవోగా బాధ్యతలు అప్పగించారు.
ఇదే అదునుగా భావించి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఫోన్ చేస్తూ నేను మీ బాస్ ఎంపీవోను మాట్లాడుతున్నా రూ.5 వేలు పంపండి, డీఎల్పీవోకు ఇవ్వాలి అంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. వారు చేసేది లేక యూపీఐలో ఇన్చార్జి ఎంపీవోకు డబ్బులు పంపడమే కాకుండా దాన్ని స్క్రీన్‌షాట్ సైతం తీసుకొని పెట్టుకున్నారు. అతడు ఫోన్ చేసిన వాయిస్ రికార్డులను సైతం తమ వద్ద భద్రపర్చుకున్నారు.
ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. బుధవారం ఈ విషయా న్ని మాజీ ఎంపీపీ దృష్టి కి తీసుకెళ్లారు. అయితే ఇటీవల పాపన్నపేట మండలంలోని మిన్పూ ర్ గ్రామానికి నూతనం గా వచ్చిన సెక్రటరీని సైతం డబ్బులు డిమాం డ్ చేయగా తాను కొత్తగా వచ్చానని డబ్బులు ఇవ్వలేనని చెప్పాడు.
దీంతో నేరుగా డీఎల్పీవో ఆ గ్రామానికి వెళ్లి నీవు సరిగ్గా విధులు నిర్వహించడం లేదు..ఇలా చేస్తే నీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని బెదిరించడం అవినీతి తతంగానికి ఊతమిస్తున్నది. ఇన్చార్జి ఎంపీవో ను వివరణ కోరగా డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవమేనని, ఇక ముందు అలా జరుగకుండా జాగ్రత్త పడతానన్నారు.