మెదక్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): నిన్నటి అనుభవం ఓ సంతోషం కావొచ్చు.. లేదంటే సంతోషపు పూలపరిమళాలు దిద్దిన అందమైన అనుభవాలు కావొచ్చు. చేదు అనుభవనాలను వదిలేసి కాసిన్ని అందమైన జ్ఞాపకాలను గుండెల్లో అదిమిపెట్టుకొని రాననున్న రోజులన్నీ తేజోవంతం కావాలని ఆశించే వేళే నూతన సంవత్సరం. నిజానికి కొత్త సంవత్సరం అని మనం చెప్పుకోవాల్సింది మార్చి 31 నుంచి. ఆ రోజు తెలుగు సంవత్సరాది ఉగాది. అయితే తిధి వార నక్షత్రాలు చూసే శ్రమ లేకుండా మారే క్యాలెండర్‌తో సరదా చేసుకునే అలవాటు వల్ల జనవరి 1వ తేదీ పండుగలా మారింది.
గుంపులు గుంపులుగా తిరుగొద్దు
-మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ అర్బన్, డిసెంబర్ 31 : 2023ను పురస్కరించుకొని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలి. కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి. ఉత్తర్వులకు వ్యతిరేకంగా గుంపులు గుంపులుగా తి రగడం, ర్యాలీలు తీయ డం వంటివి చేయొద్దు.
కనిపించని న్యూ ఇయర్ గ్రీటింగ్స్..
శుభాకాంక్షలు చెప్పడంలో కూడా ఏటేటా మార్పు వస్తున్నది. ఇది వరకు కష్టపడి వెతికి గ్రీటింగ్ కార్డు ఎంపిక చేసి వాటిపై చిరునామా రాసి తమకు కావాల్సిన వారికి పంపేవారు. ఇప్పుడు అంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండా పోయిం ది. సెల్ఫోన్లో ఎస్ఎంఎస్ ఇచ్చుకునే పద్ధతికి మారిపోయాం. టెలిఫోన్లు మాట్లాడి శుభాకాంక్షలు తెలిపే పద్ధతి కూ డా పోయింది. కేవలం మెసేజ్ ఇస్తే చాలనే అభిప్రాయానికి వచ్చేశాం.
గడిచిన కాలమంతా మనకు జ్ఞాపకమే…
కాలచక్రం గిర్రున తిరిగింది. కాలగమనంలో మరో సంవత్సరం కూడా కనుమరుగైపోయింది. గడిచిన సంవత్సరం ప్రతిఒక్కరి జీవితంలో కష్టసుఖాలు, సంతోషాలు, బాధలను మిగిల్చి కాలం ఒడిలోకి 2022 సంవత్సరం చేరిపోతోంది. ఇక సెవలంటూ చరిత్ర పుటల్లోకి వెళ్లిపోతోంది. కాలం అందరికీ ఎప్పుడు ఒకే అనుభూతులను ఇవ్వదు. ఒకరికి చేదు గుళిక కావొచ్చు. మరొకరికి ప్రసాదం కావొచ్చు. ఏదీఏమైనా గడిచిన కాలమంతా మనకు జ్ఞాపకమే.
కొందరికీ తీపి గుర్తులను మిగిల్చితే మరికొంత మందికి అనుభవాలను వెలకట్టలేని గుణపాఠాలను నేర్పి వెళ్తుంది. 2022 సంవత్సరం కూడా ఇక సెలవంటూ వెళ్లిపోయేందుకు సిద్ధమవుతోంది. గత జ్ఞాపకాలను నెమరువేస్తూ.. భవిష్యత్‌ను ఊహి స్తూ.. జీవితంలోకి సరికొత్త ఉషస్సును ఆశి స్తూ.. ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆశయాలు.. జీవితానికి కొత్త గమ్యాలను ఏర్పర్చుకుం టూ ఇలా ఎన్నో ఊహాల పల్లకీకి రెక్కలు తొడుగుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు జనాలు సిద్ధమవుతున్నారు.
కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి…
2023 నూతన సంవత్సరంలో సాధించాల్సిన, ఆచరించాల్సిన వాటిపై ప్రతీది ప్లాన్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలో జీవితం బంగారుమయం కావాలని ప్రతిఒక్కరూ ఆశపడుతుంటారు. కొత్త ఏడాది నుంచి తమకు తాము ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదో అని ప్రణాళికలు రచించుకుంటారు. కొత్త సంవత్సరం నుంచి మందు మానేయ్యాలని.. సిగరెట్‌కు దూరంగా ఉండాలని ఇలా చెడుఅలవాట్లను దూరం చేసుకోవాలని కొందరు ప్రతినబూనుతుండడం మనకు సహజంగా కనిపిస్తుంటుంది. అందరూ వారి వారి పాత దురాలవాట్లకు దూరంగా మంచి వాటి వైపు అడుగులు వేయాలని ప్రతినభూనుతుంటారు.
ప్రతీఒక్కరి జీవితంలోనూ ఈ నూతన సంవత్సరం ఆనందం నింపాలని, హాయిగా గడపాలని కోరుకుంటారు. 2023 తమ జీవితాల్లో మార్పు తీసుకువస్తుందని, తీసుకురావాలని బలమైన కోరికతో సకల జనులు అనేక కొత్త నిర్ణయాలతో ప్రయత్నాలు ఆరంభిస్తారు. అలాంటి వారందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతోంది 2023 సంవత్సరం. సరికొత్త ఆశలతో 2023 సంవత్సరానికి యావత్తు జిల్లా ప్రజానీకం స్వాగతం పలుకుతోంది. కొత్త ఆశలు.. సరికొత్త అవకాశాలు.. ఆనందాల హరివిల్లుతో ఈ ఏడాదంతా సాగాలని, ప్రతీక్షణం మధురానుభూతులనివ్వాలని ఆక్షాంక్షిద్దాం.
కొత్త ఏడాదిలో సుఖ సంతోషాలతో విలసిల్లాలి
కొత్త ఏడాదిలో ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలి. రాష్ట్ర ప్రభుత్వం వ్రవేశపెట్టిన సంక్షస్త్రమ పథకాలు ప్రజలు అందజేసి బంగారు తెలంగాణ సాధించుకున్నాం. పేదల సొంతింటి కల నెరవేర్చాం. మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు మరింతగా అందాలని ఆకాక్షిస్తున్నా. రైతులకు సాగు నీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందుతోంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
-ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
2023 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలి
-నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
మెదక్ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతిఇంటా నూతన సంవత్సరంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ సం వత్సరం మెదక్ ప్రజల జీవితాల్లో, రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పులకు దారితీయాలని ఆయన కోరారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. నూతన సంవత్సరంలో మెదక్ జిల్లా అభివృద్ధి పథంలో మరింత ముందుకు పయనించే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేయాలని పిలుపునిచ్చారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు
-మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు హరీశ్, శరత్‌కుమార్ నాయక్
మెదక్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి : 2023 నూతన సంవత్సరం ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని, ఆనందోత్సవాల మధ్య వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు హరీశ్, శరత్‌కుమార్ నాయక్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రజలు సరికొత్త ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్నో ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు పడ్డాయని, నిరుద్యోగ యువత జీవితంలో స్థిరపడటానికి చకటి అవకాశమని, కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలన్నారు.
కరోనా మహమ్మారి దరిచేరకుండా ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం ప్రతిఒకరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.