చేర్యాల, జూన్ 1 : చేర్యాల పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆలయాల్లో వేద పండితులు, పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు అన్నదానం చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), జూన్1: మద్దూరు, ధూళిమిట్ట మండల కేంద్రాలతో పాటు వివిధ గ్రామాల్లో హన్మాన్ జయంతిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మదూ ద్దూరు ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుడు పానుగంటి తిరుపతయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు వివిధ పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
వర్గల్, జూన్1: వర్గల్‌లోని బాలాంజనేయస్వామి దేవాలయంతోపాటు దండుగడ్డ, సీతారాంపల్లి, గౌరారం, వేలూర్, మీనాజీపేట, తున్కిఖల్సా చౌదర్పల్లి, సింగాయిపల్లి గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో మూలవిరాట్‌కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.
హుస్నాబాద్‌టౌన్, జూన్ 1: హుస్నాబాద్‌లోని పాటిమీద హనుమాన్, గోదాంగడ్డ, శివాజినగర్ తదితర హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక హోమాలు, మహిళల పారాయాణలు, పూజ లు, అభిషేకాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న దంపతులతోపాటు పలువురు పాల్గొన్నారు.
గజ్వేల్, జూన్ 1: పట్టణంలోని పాండవుల చెరువుకట్టపై ఉన్న హనుమాన్ దేవాలయం, కేసరి హనుమాన్ దేవాలయం, అంగడిపేట హనుమాన్ దేవాలయాల్లో వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. పాండవుల చెరువుకట్టపై స్వామివారిని ప్రత్యేకంగా పండ్లతో అలంకరించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ చైర్మన్ భాస్కర్, పట్టణవాసులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి రామరాజు హనుమాన్ జయంతి సందర్భంగా పుచ్చకాయపై హనుమాన్ బొమ్మను చిత్రించాడు.
మిరుదొడ్డి, జూన్ 1: మండలంలోని ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమాన్ జయంతి పురస్కరించుకొని శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మిరుదొడ్డి టౌన్లో పురోహితుడు రాజ పున్నయ్య ఆంజనేయ స్వామి విగ్రహానికి చందనం, తమల పాకుల అర్చన నిర్వహించారు. గ్రామస్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
బెజ్జంకి, జూన్ 1: మండల కేంద్రంతోపాటు గాగిల్లాపూర్‌లోని హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జయంతిని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారి కి పంచామృత అభిషేకం, క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బెజ్జంకిలో అన్నదానం చేశారు.
రాయపోల్, జూన్ 1: దౌల్తాబాద్ మం డలం శ్రీసీతారంపల్లిలో హన్మాన్ జయంతిని జరుపుకొన్నారు. ఆలయ వ్యవస్థాపకుడు గిరీశ్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. హన్మాన్ స్వాములకు అన్నదానం చేశారు.
సిద్దిపేట అర్బన్, జూన్ 1 : సిద్దిపేట పట్టణంలోని గణేశ్‌నగర్‌లో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా విశ్వశాంతి, లోక కల్యాణార్థం జరిగిన అఖండ హనుమాన్ చాలీసా సప్తాహం సమాప్తం అయ్యింది. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ నిర్వహణలో అర్చకుడు చిలకమర్రి వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం శనివారం ముగిసింది.
హనుమాన్ జయంతి సందర్భంగా గణేశ్‌నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం, అర్చన, ప్రత్యేక అలంకరణ జరిగాయి. హనుమాన్ చాలీసా హవ నం, పూర్ణాహుతి జరిగాయని అర్చకుడు రమణాచార్యులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.