సిద్దిపేట, జూన్ 14: ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, కార్యక్రమాలు పక్కాగా అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని సిద్దిపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కె.హైమావతి అన్నారు. శనివారం సిద్దిపేటలోని సమీకృత కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. కొత్త కలెక్టర్ హైమవతికి జిల్లా అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనం తీసుకొని కలెక్టర్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పరిచయం చేసుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బదిలీపై వెళ్లిన కలెక్టర్ మనుచౌదరిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.