చేగుంట, జూలై 20: మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్పల్లిలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు శనివా రం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆల య వ్వవస్థాపకుడు అంబటి ఆంజనేయులు, చైర్మన్ బచ్చు రమేశ్గుప్తా,
మాజీ చైర్మన్ తుమ్మ యాదగిరి, ఆలయ కమిటీ ఆధ్వర్యం లో ఆదివారం స్వామి వారికి మహాభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు, తీర్థప్రసాద వితరణ, మహా హారతి, అన్నదానం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.