గుమ్మడిదల, ఫిబ్రవరి 26: ప్యారానగర్లో డంపుయా ర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ మహాశివరాత్రి పండుగ రోజున నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. గుమ్మడిదలలో జేఏసీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. రైతు, మహిళా జేఏసీ అధ్యక్షులు చిమ్ముల జైపాల్‌రెడ్డి, ఇందుల మల్లమ్మ, అఖిలపక్ష నాయకులు కలిసి జాతీ య రహదారి నుంచి గ్రామంలో గుమ్మిడిదలలో కలశాలతో ర్యాలీగా చంద్రమౌళీశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నా రు. డంపింగ్‌యార్డు ఏర్పాటును విరమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ మనుసు మార్చండి శివా అంటూ మహిళా జేఏసీ నాయకులు కలశాలతో శివలింగానికి అభిషేకాలు, పూజలు చేశారు.
గుమ్మిడిదలలో అంబేద్కర్ చౌరస్తా వద్ద 16వ రోజు రిలే నిరాహార దీక్షలో రెడ్డి సం ఘం సభ్యులు పాల్గొన్నారు.రిలే దీక్షలకు నిర్విరామంగా కొనసాగడానికి రెడ్డి సంఘం రూ.లక్షన్నర విరాళంగా జేఏసీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డికి అందజేసింది. ఆందోళనల్లో జేఏసీ నేతలు గోవర్ధన్‌రెడ్డి, చిమ్ముల నర్సింహారెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఆంజనేయులు, రెడ్డి సంఘం నేతలు మద్దుల బాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, పోచుగారి శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి, దేవేందర్‌రెడ్డి, ర మణారెడ్డి, అమ్మగారి రవీందర్‌రెడ్డి, రాంరెడ్డి, జైపాల్‌రెడ్డి, కాలకంటి రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్యారానగర్-నల్లవల్లి గ్రామస్తుల నిరసన…
నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తున్న అటవీ ప్రాంతంలో జీవగంగను తలపించే బుగ్గకుంట ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తుంది. ఈ బుగ్గకుంట సమీపంలో శివలింగం ఉంది. దీనిని బుధవారం నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ గ్రామాల జేఏసీ నాయకుల, యువకులు దర్శించుకున్నారు. డంపింగ్‌యార్డు ఏర్పాటు కాకుండా చూడం డి తండ్రి అని మొక్కుకున్నా రు. అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు నీరు అందించే బుగ్గకుంట కలుషితం కాకుండా ప్రభుత్వం స్పందించాలని కోరుకున్నారు. నల్లవల్లి, కొత్తపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం యువకులు 22వ రోజు రిలే నిరాహా ర దీక్ష చేపట్టారు. దీక్షలో యువకులు