సిద్దిపేట, ఆగస్టు 15: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 9.30 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. 9.40 గంటలకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాత్రంత్య సమరయోధులు లక్ష్మి, పద్మ, సరోజన, ఓజమ్మ, లింగయ్య, ఆగంరెడ్డి, వెంకట్రెడ్డి,రాంరెడ్డి, కిష్టయ్యను సన్మానించారు.
10.15 గంటలకు ఆగ్నిమాపక శాఖ సిబ్బంది గ్యాస్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయా శాఖల శకటాలను ప్రదర్శించారు. 11స్టాళ్లను ఏర్పాటు చేయగా, వాటిని మంత్రి సందర్శించారు. అనంతరం 239 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఆందించి, అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ, ఆధికారులు, ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.