మెదక్,ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభు త్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, హామీలన్నీ అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు. మెదక్‌లోని పోలీసు పరేడ్ గ్రౌం డ్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ మహేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రసంగించారు. మెదక్ జిల్లాలో అన్ని పథకా లు, కార్యక్రమాలు సజావుగా అమలు చేస్తున్నట్లు చెప్పా రు. జిల్లాలో ఇప్పటివరకు 1.07 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్ప టి వరకు 1,21,207 మంది వినియోగదారులకు జీరో బిల్లును జారీ చేసినట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో 74,342 మంది రైతులకు 473.76 కోట్ల రూపాయల పంట రుణాల మాఫీ జరిగినట్లు కేశవరావు తెలిపారు. మిగతా పథకాలను జిల్లా యంత్రాంగం విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, డ్రగ్స్, మత్తు, మాదకద్రవ్యాల వినియోగం, వాటి రవాణా, అమ్మకంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు.
సైబర్ నేరాలు, నకిలీ విత్తనాలు, బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు తదితర వాటి గురించి పోలీస్ కళాబృందాలతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో కమ్యూనిటీ ప్రాజెక్ట్ కింద 1907 సీసీ కెమెరాలు, నేను సైతం కార్యక్రమంలో భాగంగా 1772 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. సీసీ కెమెరాలు జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసి అనుక్షణం పర్యవేక్షిస్తున్నట్లు కేశవరావు తెలిపారు. వేడుకల్లో విద్యార్థినీవిద్యార్థుల సాంసృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నా యి. శకటాలు, ఫైర్ ఇంజిన్ ప్రదర్శనలు అలరించాయి. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అం దజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకు లు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.