మెదక్ రూరల్ : హవేలిఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాయలంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవారు మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
అమ్మవారి చల్లని చూపు గ్రామ ప్రజల అందరిపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు ఆయురా రోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గౌడ సంఘం నాయకులు వారని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, సాప శ్రీనివాస్, సాప సాయిలు, గ్రామ గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.