సిద్దిపేట జిల్లాలో ఆదివారం అట్ల బతుకమ్మను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులా రాజనర్సు, కౌన్సిలర్ కొండం కవితా సంపత్‌రెడ్డి, మహిళా కార్యకర్తలు, మహిళలు బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు.
సిద్దిపేట పట్టణంలో దాసాం జనేయ ఆర్యవైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో 8 పీట్ల బతుకమ్మను ఏర్పాటు చేసి ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. కోమటి చెరువుపైన పట్టణ మహిళలు బతుకమ్మ సంబురాలు నిర్వహించు కున్నారు. బతుకమ్మ ఆడి చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం పిండి వంటలు తిన్నారు.
-సిద్దిపేట స్టాఫ్ ఫొటోగ్రాఫర్, అక్టోబర్ 6