మెదక్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేతల బెదిరింపులు, పోలీసుల దాడులు, అక్రమ కేసులతో పేదలు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం చేసిన వారిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో పాటు అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈనెల 9న ఎన్నికల ప్రచారంలో భాగం గా మెదక్ 15 వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య ఘ ర్షణ జరిగింది.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వాహనంపై రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారని మెదక్ పట్టణానికి చెందిన 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కూలి చేసుకుని జీవించే పేదలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి జైలుకు పంపించా రు. గురువారం మెదక్‌లోని పలు కుటుంబాలకు చెందిన పేదలు సంగారెడ్డి జైలుకు వెళ్లి వారి కుటు ంబ సభ్యులను పరామర్శించారు. సంగారెడ్డి జైలు లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, పేదలను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మున్సిపాల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ పరామర్శించారు.
అక్రమంగా కేసులు నమోదు
కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని, కాంగ్రెస్ నేతలు తమపై దాడులు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఎస్సీ మహిళ ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని, ఎమ్మెల్యే వాహనంపై రాళ్లతో దాడి చేసి హత్యాయత్నం చేశారని కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాపై అన్యాయంగా కేసులు పెట్టారు
మున్సిపల్ ఎన్నికల్లో మా కుటుంబంపై పోలీసులు అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేపై దాడి చేశారని కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. రాజకీయ కక్షతోనే పోలీసులు కేసులు నమోదు చేసి మా లాంటి సామాన్యులను ఇబ్బందులు గురిచేస్తున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి పేదలను ఇబ్బందిపెడుతున్నారు.
– అనురాధ , మెదక్
ఇబ్బందులు పడుతున్నాం
పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులను జైలుకు పంపడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కాంగ్రెస్ నాయకులు పోలీసులతో అక్రమంగా కేసులు నమోదు చేయించి సంగారెడ్డి జైలుకు పంపించారు. కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించడంలో కాంగ్రెస్ నేతల పాత్ర ఉంది. ఎన్నికల్లో జరిగిన చిన్న ఘటనపై కేసులు పెట్టారు. కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం. – భారతి, మెదక్
జైలుకు పంపించారు
పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. పేదలను ఇబ్బందులకు గురి చేసే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. పేదల ఉసురు ఊకే పోదు. పనులు చేసుకొని జీవనం సాగించే వారి పై కేసులు నమోదు చేసి జైలుకు పంపించడంతో కాంగ్రెస్ పార్టీకే నష్టం. కేసులు నమోదు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పుడు ఏంజరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది.
– స్వరూప, మెదక్
పేదలపై సర్కారు కక్ష
కాంగ్రెస్ సర్కారు పేదలపై కక్ష పెట్టుకొని పోలీసుల చేత కేసులు నమోదు చేయించి జైలుకు పంపింది. కూలి పనిచేసుకుని జీవనం సాగిస్తున్న పేదలను జైలుకు పంపించడంతో కుటుంబ సభ్యులం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అక్రమంగా పోలీసు కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు.
– అస్మద్ది, మెదక్
ఇబ్బందులకు గురిచేస్తున్నారు
కాంగ్రెస్ సర్కారు కేసులు పెట్టి పేదలకు ఇబ్బందులకు గురిచేస్తుంది. మా కుటుంబ సభ్యుల పై కేసులు పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారు. కుటుంబ సభ్యులు జైలుకు పోవడంతో భయాందోళనలో ఉన్నాం. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు, దాడులు చేసి పోలీసు కేసులు నమోదు చేయించారు.
– జహీరా, మెదక్