మెదక్ మున్సిపాలిటీ, జనవరి 15: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చేయనున్న నూతన పథకాలపై బుధవారం ఉమ్మడి జిల్లా కలెక్టర్లు రాహుల్‌రాజ్, క్రాంతి, మనుచౌదరిలతో ఢిల్లీ నుంచి గూగుల్ మీట్ ద్వారా నిర్వహించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి మెదక్ జిల్లా నోడల్ ఆఫీసర్ హరిచందనతోపాటు పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజ్యాంగం అమలులోకి వచ్చి 2025, జనవరి 26 నాటికి 75 ఏండ్లు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, నూతన రేషన్‌కార్డుల మం జూరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు నిర్ణయించిందన్నారు.
ఈ పథకాలకు సంబధించిన విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక, క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై మంత్రి కలెక్టర్లతో చర్చించారు. రాజకీయ ప్రమేయం లేకుండా పథకాలు ప్రయోజనాలు పేదలకు అం దేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భూభారతి పోర్టల్‌లో నమోదైన పట్టాదారులు మాత్రమే రైతుభరోసా పథకం కింద అందించే ఆర్థిక సహాయానికి అర్హులన్నారు. రియల్ భూములు, నాలా కన్వర్సన్ భూములు, లేఅవుట్ భూములు, మైనిం గ్ భూములు, గోదాంలు, ఫంక్షన్ హాళ్లు నిర్మించిన భూములకు ఈ పథకం వర్తించదన్నారు. ఈ పథకం అమలుకు నోడల్ ఆఫీసర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. భూములకు సంబంధించిన వివరాలను రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటే భవిష్యత్తు అవసరాలకు బాగుంటుందని, ఆ దిశగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుకు కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవాని మంత్రి కలెక్టర్లకు తెలిపారు.
ఈ పథకం కింద భూమి లేని పేద వ్యవసాయ కూలి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందివ్వనున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఉపాధిహామీ కింది కనీసం 20 రోజులు పని చేసిన వారిని లబ్ధిదారులుగా గుర్తిస్తామన్నారు. గ్రామసభలు నిర్వహించి మార్గదర్శకాల అనుగుణంగా లబ్ధిదారులను గుర్తించాలని, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో విధివిధానాలను మంత్రి కలెక్టర్లతో చర్చించారు. సీఎం ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా గుర్తించిన వారిలో అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జనవరి 26 నాటికి లబ్ధిదారులు జాబితాను వెల్లడించే విధంగా సన్నద్ధంగా ఉండాలన్నారు.
ఒక వ్యక్తికి ఒకేచోట రేషన్‌కార్డు ఉండేలా వన్ రేషన్, వన్ స్టేట్‌గా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అర్హత గల ప్రతి కుటుంబానికీ రేషన్‌కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కొత్తగా అమలు చేయనున్న పథకాలకు సంబంధించి ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. లబ్ధిదారుల ఎంపికకు గ్రామాల వారీగా టీమ్‌లు ఏర్పాటుతోపాటు గ్రామ సభల నిర్వహణకు షెడ్యూలు తయారు చేసుకున్నట్లు మెదక్ కలెక్టర్ రాహూల్ రాజ్ మంత్రికి వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్‌రెడ్డి, హౌసింగ్ పీడీ మాణిక్యం, ఈడీఎం సందీప్ పాల్గొన్నారు.
ఘనపూర్‌కు నీటి విడుదల
పాపన్నపేట, జనవరి 15: యాసంగి పంటకు సిం గూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు బుధవారం అధికారులు నీటిని విడుదల చేశారు. మెదక్ జిల్లా ఘనపురం ఆయకట్టు పరిధిలోని 21.625 ఎకరా ల సాగుకు సుమారు 3 టీఎంసీల నీరు అవసరం అవుతుందని చెప్పారు. ఇందులో మొదటి విడతగా 0.35 టీఎంసీల నీటిని కలబ్గూర జెన్కో ప్రాజెక్టు నుంచి విడుదల చేశారు. గురువారం సా యంత్రం వరకు ఘనపురం ప్రాజెక్టుకు నీకు చేరుతుందని, పశువులకాపరులు, మత్స్యకారులు మం జీరా నదిలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.