జహీరాబాద్, ఏప్రిల్ 5: జహీరాబాద్ పట్టణానికి చెందిన ఎలుగొండ భార్గవీ క్యారం బోర్డు పోటీలో బంగారు పత కాన్ని సాధించింది. స్ధానిక పట్టణానికి చెందిన ఎలుగొండ భార్గవీ తమిళనాడులోని తిరుచి ఐఐఐటీలో చదువుకుంటుంది.
ఇటీవల గ్యాలియర్లో జరిగిన అంతర్ రాష్ట్ర క్యారంబోర్డు పోటీలో భార్గవి పాల్గొంది. ఈ పోటీలో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించడంపై జహీరాబాద్ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు జనార్థన్, విద్యార్థినీ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో రాణించాలని అశాభావం వ్యక్తం చేశారు.