తొగుట, ఆగస్టు 8: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి పరవళ్లు మొదలయ్యాయి. గురువారం తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి అధికారులు నాలుగు పంపులను ఆన్‌చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు.
ఒక్కో పంప్ నుంచి 0.432 టీఎంసీల నీటిని మల్లన్నసాగర్‌లోకి పంపిస్తున్నారు. సముద్రాన్ని తలపించేలా బహుళ ప్రయోజనాలతో నిర్మించిన మల్లన్నసాగర్లో నీటినిల్వ సామర్థ్యం మరింత పెరిగి భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.