‘పది’లో దిగజారిన మెదక్ స్థానం
పదో తరగతి ఫలితాల్లో బాలికలు హవా చాటారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మెదక్ జిల్లా 96.63 శాతం ఉతీర్ణతతో రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచింది. గతేడాది 12వ స్థానంలో నిలిచింది.
- గతేడాది రాష్ట్రస్థాయిలో 12వ స్థానం, ఈసారి 22వ స్థానం
- 11,232 మందికి 10,853 మంది ఉతీర్ణత
- జిల్లా వ్యాప్తంగా 96.63 శాతం ఉతీర్ణత నమోదు
- ఫలితాల్లో బాలికలదే హవా..
- బాలికల ఉతీర్ణత శాతం 97.56, బాలుర ఉతీర్ణత శాతం 95.67
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 29 : పదో తరగతి ఫలితాల్లో బాలికలు హవా చాటారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మెదక్ జిల్లా 96.63 శాతం ఉతీర్ణతతో రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచింది. గతేడాది 12వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు జరిగాయి. జిల్లాలో 68 పరీక్ష కేంద్రాల్లో 11,232 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 10,853 మంది ఉతీర్ణులయ్యారు. ఇందులో బాలురు 5,572 మందికి 5,331 మంది ఉతీర్ణులు కాగా (95.67 శాతం), బాలికలు 5,660 మందికి 5,522 (97.56 శాతం) ఉతీర్ణత సాధించినట్లు డీఈవో విజయ తెలిపారు.
జిల్లాలో 126 పాఠశాలలు వంద శాతం ఉతీర్ణత
మెదక్ జిల్లాలో 126 పాఠశాలలు వంద శాతం ఉతీర్ణత సాధించాయి. ఇందులో 77 జిల్లా పరిషత్ పాఠశాలలు, 25 ప్రైవేట్ పాఠశాలలు, 9 కేజీబీవీ పాఠశాలలు, 4ఆదర్శ పాఠశాలలు, 4 బీసీ వెల్పేర్ గురుకుల పాఠశాలలు, 3 టీడబ్ల్యూ పాఠశాలలు, 2 సోషల్ గురుకుల పాఠశాలలు, 1 మినీ గురుకుల పాఠశాల, 1 గురుకుల పాఠశాలు ఉన్నాయి. అల్లాదుర్గం, నిజాంపేట, వెల్దుర్తి మండలాలు వంద శాతం ఉతీర్ణత సాధించాయి. చేగుంట, చిలిపిచేడ్, మనోహరబాద్, టేక్మాల్, మాసాయిపేట మండలాలు 99 శాతం ఉతీర్ణత సాధించగా, కొల్చారం, చిన్న శంకరంపేట, కౌడిపల్లి, నార్సింగి, మండలాలు 98శాతం ఉతీర్ణత సాధించాయి. హవేళీఘనఫూర్, తూఫ్రాన్ మండలాలు 97 శాతం, రేగోడ్, శివ్వంపేట, రామాయంపేట, పెద్ద శంకరంపేట, మెదక్ మండలాలు 96 శాతం ఉతీర్ణత సాధించాయి. పాపన్నపేట మండలం 91 శాతం, నర్సాపూర్ 86 శాతం ఉతీర్ణత సాధించాయి. జిల్లా కేంద్రంలోని గీత పాఠశాలకు చెందిన మాధవి 600 మార్కులకు 583 మార్కులు సాధించింది. సిద్ధ్దార్థ్ పాఠశాలకు చెందిన శ్రీ సిందు 582 మార్కులు, సరస్వతి కాన్వెంట్కు చెందిన సోన 575 మార్కులు సాధించింది
జూన్ 5 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు..
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి 12 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ఫీజు ఏప్రిల్ 30 నుంచి మే 14వ తేదీలోగా తమ పాఠశాలల్లో చెల్లించాల్సి
రీకౌటింగ్‌కు..
రీకౌంటింగ్ కోరే అభ్యర్థులు ఫలితాలు వెలువడిన రోజు నుంచి సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఫీజు 15 రోజుల్లోగా చలాను ద్వారా చెల్లించాలి. రీవెరిఫికేషన్ కోసం ఒక సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలని డీఈవో విజయ తెలిపారు.
సంగారెడ్డికి ఆరో స్థానం
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 29 : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కాగా, 98.69 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. గతేడాది 99.09శాతంతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవగా, ఈసారి నాలుగు స్థానాలకు పడిపోయింది. జిల్లాలో మొత్తం 24,573 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 24,252 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో 98.69శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురకు సంబంధించి 12,772 మం ది పరీక్షలకు హాజరుకాగా, 12,548 మంది బాలు రు ఉత్తీర్ణత సాధించారు. దీంతో 98.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 11, 801 మంది పరీక్షలు రాయగా, 11,704 మంది ఉత్తీర్ణులయ్యారు. 99.18శాతం ఉత్తీర్ణతతో బాలికలకు పైచేయిగా నిలిచారు. యాజమాన్యాల వారీగా జిల్లాలో అత్యధికంగా తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో వందశాతం ఫలితాలు నమోదయ్యాయి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- 10th grade results
- girls
- medak
- ssc
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

