Girl Death | తూప్రాన్, ఫిబ్రవరి 12: ఆడుకుంటూ చెరువులో పడి ఓ బాలిక మృతి చెందిన సంఘటన తూప్రాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూప్రాన్ పట్టణ వాసి చాంద్‌పాషా, పర్వీన్ దంపతులకు పాప, బాబు సంతానం. కాగా బుధవారం ఉదయం తల్లి పర్వీన్‌తో కలిసి కుమార్తె జుబేరియా (6) తూప్రాన్ పెద్ద చెరువు వదద బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి బట్టలు ఉతుకుతుండగా జుబేరియా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.