పటాన్చెరు, డిసెంబర్ 3: సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం చిట్కుల్ గ్రామంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ పిలుపు మేరకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు. ముగ్గురు దివ్యాంగులకు బ్యాట రీ వీల్ చైర్స్, ఇద్దరికి హోండా యాక్టీవా బైక్, 40 మంది కి నిత్యావసర సరకులు అందజేశారు. దివ్యాంగులతో కలసి మధుముదిరాజ్ కేక్ కట్‌చేసి సంబురాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ రూ.3 వేల పింఛన్ ఇస్తున్నారన్నారు. ఇది దేశంలో ఎక్కడా లేదన్నారు. తన మిత్రులు రూ. 4.50 లక్షలు సేకరించి దివ్యాంగులకు సాయం చేశారన్నారు. ఎవరైనా అంగవైకల్యం పేరున తిడితే రూ.5 వేలు ఫెనాల్టీ వేసేలా చిట్కుల్ పంచాయతీలో తీర్మానిస్తామన్నా రు. మంత్రి కేటీఆర్, హరీశ్‌రావుల ఆశీస్సులతో తాను అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేస్తున్నానన్నారు.
కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రవికుమార్, నీలం మధు ముదిరాజ్ సేవాభావాన్ని కొనియాడారు. దివ్యాంగులు మధు ముదిరాజ్‌ను ఘనంగా సత్కరించా రు. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, రవికుమార్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్, చాకలి వెంకటేశ్, నారబోయిన శ్రీనివాస్, సత్యనారాయణ, సుంకరబోయిన మహేశ్, సురేశ్, ప్రశాంత్, చంటి, రఘు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.