మెదక్ రూరల్ నవంబర్ 28 : శ్రీకాల భైరవ స్వామి ఆలయ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి రాజశేఖర్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా మెదక్ మండలంలోని ఖాజీపల్లి గ్రామంలో శ్రీఅష్ట కాలభైరవ స్వామి 15 వ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు ఖాజీపల్లి(కాశిపల్లి) కాలభైరవ స్వామి ఆలయానికి హిందూ ధర్మ పరిరక్షకులు శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి, కాలభైరవ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివస్వామి పర్యవేక్షణలోస్థాపిత దేవతా మూల మంత్ర హవనములు, రుద్ర సహిత చండీ హోమం, మహా పుర్ణాహుతి, మహా నివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, కలశోద్వాసన, అవభృతం, వేద ఆశీర్వచనం జరిగాయి. జిల్లాలోని భక్తులు అధిక సంఖ్యలో పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు తదితరులు ఉన్నారు.