మెదక్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ) : కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో ప్రాజెక్టు లు, చెరువులు, చెక్‌డ్యామ్‌లకు జలకళ వచ్చిం ది. పాపన్నపేట, కొల్చారం మండలాల మధ్య ఉన్న ఘనపూర్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో నిండుకుండలా మారింది. చెరువులకు నీరు చేరుతుండగా, మరికొన్ని అలుగు పారుతున్నాయి. మంజీరా, హల్దీవాగుల్లో వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతోంది. బోరు, బావుల్లో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి, సోయాబీన్, మొక్కజొన్నతో పాటు పలు పంటలకు మేలు జరిగింది.
భారీ వర్షాల వల్ల రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టుల వద్దకు ప్రజ లు వెళ్లవద్దని, సెల్ఫీలు తీసేందుకు ప్రయత్నం చేయవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కామారెడ్డి, మెద క్ జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో పొంగిపొర్లుతున్నది.
మెదక్ జిల్లాలో అత్యధికంగా శంకరంపేట(ఏ)లో 43.3 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం కురిసిన వర్షంతో జిల్లా సగటు వర్షపాతం 23.6 మిల్లీమీటర్లు నమెదు కాగా, సాధారణ వర్షపాతం 8.6 మి.మీటర్లతో పోలిస్తే 174 శాతం అధికంగా వర్షం పడింది. రేగోడ్‌లో 45.5, పాపన్నపేటలో 43.1, నా ర్సింగ్లో 36.6. శివంపేటలో 33.5, హవేళిఘనపూర్‌లో 33.1, టేక్మాల్‌లో 27.0, వెల్దుర్తిలో 26.8, రా మాయంపేటలో 24.5,చేగుంటలో 53, పాపన్నపేటలో 45, కొల్చారంలో 46 శాతం నమోదకాగా అత్యల్పంగా తూప్రాన్‌లో 1.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో ప్రాజె క్టు, చెరువులు, చెక్‌డ్యామ్‌ల కింద రైతులు నాట్లు వేస్తున్నారు. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడడంతో రైతులు సంతో షం వ్యకం చేశారు. 15 రోజుల క్రితం వేసిన నాట్లు వర్షాలతో పచ్చగా కళకళలాడుతున్నా యి. ప్రాజెక్టులు, చెరువులోకి వరద రావ డంతో సాగు, తాగునీటి కష్టాలు ఉండవని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.