వట్పల్లి, అక్టోబర్ 26: పత్తిలో సాగు చేస్తున్న గంజాయి పంటను ఎక్సైజ్ సీఐ వీణారెడ్డి బృందం పట్టుకుంది. మండలంలోని ఉసిరికపల్లి గ్రామం లో నమ్మదగిన సమాచారంతో శనివారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. అందోల్ ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి వివరాల ప్రకారం..
ఉసిరికపల్లిలో మన్నె విఠల్ పత్తిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నాడనే సమాచారంతో ఎక్సైజ్ సిబ్బం ది దాడి చేసి 16 కిలోల ఎండు గంజాయి, 17 పచ్చి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. పచ్చి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాగుదారుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఎక్సైజ్ ఎస్సై అనిల్, సిబ్బంది రామారావు తదితరులు పాల్గొన్నారు.