కంది, మే 14: వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలముఠాను అరెస్టు చేసినట్లు సంగారెడ్డి డీఎస్సీ సత్తయ్యగౌడ్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. ఒకే కుటుంబానికి చెందిన నిం దితులు జల్సాలకు అలవాటు పడి తప్పుడు మార్గం లో అధిక డబ్బులు సంపాదించాలని తాళం వేసిన ఇండ్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.
సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట్లో నివాసముంటున్న నిందితులు మార్ల యాదగిరి, మార్ల అనిత, వీరి కుమారుడు మైనర్‌తో పాటు ముస్లాపూర్‌కు చెందిన తలారి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం సంగారెడ్డి బైపాస్‌లో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, ఏపీ 23 టీఏ 0092 ఆటోను ఆపే క్రమంలో అందులో ఉన్న ఈ నలుగురు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. వీరిని వెంబడించి పట్టుకొని విచారణ చేపట్టారు. సంగారెడ్డి రూరల్, హ త్నూర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరు దొంగతనాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారన్నారు.
నిందితుల నుంచి 29తులాల బంగారు ఆభరణాలు, 18తులాల వెం డి, రూ. 4లక్షల నగదు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. నిందితుడు యాదగిరి పాత నేరస్తుడ అని, ఇతనిపై సుమారు 50కి పైగా దొంగతనాల కేసులు ఉన్నాయని తెలిపారు. గతంలో ఇతరులతో చోరీలకు పాల్పడే వాడని, ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి నేరాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో రూరల్ సీఐ క్రాంతికుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.