గజ్వేల్,జూన్7: రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేటివ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని మంగళవారం నూతనంగా నియామకమైన గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ సమీకృత మార్కెట్‌తో పాటు గజ్వేల్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధిని చూడటానికి వస్తున్నారంటే సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే కారణమన్నారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతులు, వ్యాపారులకు అవసరమైన విధంగా చర్యలు తీసుకుని వ్యవసాయాభివృద్ధికి కృషి చేయాలని నూతన ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్‌కు సూచించారు. ఆయన వెంట వైస్ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, కార్యదర్శి జాన్‌వెస్లీ, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్ ఉన్నారు.