గజ్వేల్, ఆగస్టు 30: ఉమ్మడి రాష్ట్రంలో గజ్వేల్ ప్రాంతం సాగు,తాగునీటికి అల్లాడిందని, దుర్భిక్ష పరిస్థితులకు తోడు అభివృద్ధిలో వెనుకబాటుకు థగురైందని, ఈ ప్రాంతం నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహించడంతో దశమారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం గజ్వేల్ మండలంలోని బెజుగామలో 20 కుటుంబాలు, శేరిపల్లిలో 20కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు అందజేసి వారితో గృహప్రవేశాలు చేయించారు. బెజుగామలో సర్పంచ్ అండాలు, ఎంపీటీసీ గంగాధర్, శేరిపల్లిలో సర్పంచ్ కనకయ్య, ఎంపీటీసీ జ్యోతి స్వామితో కలిసి లబ్ధ్దిదారులతో మంత్రి గృహప్రవేశాలు చేయించారు. బెజుగామలో రైతువేదికను ప్రారంభించారు. అనంతరం గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన 1554 మంది కొత్త పింఛన్‌దారులకు పింఛన్ కార్డులను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇంటి అడుగు జాగలో ఇండ్లు కట్టుకునే వారికి దసరా నుంచి రూ.3లక్షలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇండ్లు కట్టుకునేందుకు రూ.60వేలు ఇచ్చేవారన్నారు. అవి బేస్మెంట్కు కూడా సరిపోయేవి కావన్నా రు. పైగా దళారులకు డబ్బులు పోనూ, లోనుగా రూ.40వేలు మీదపడి కేవలం రూ.10వేలు చేతికి వచ్చేవని గుర్తుచేశారు. కానీ, టీఆర్ఎస్ హయాం లో సీఎం కేసీఆర్ పేదలకు పైసా ఖర్చులేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి కులం,మతం ఏమీ లేదని, ప్రతి పేదవాడికి మంచి చేయడమే ధ్యేయమన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రాతినిధ్యం వహించక ముందు గజ్వేల్‌లో కాంగ్రెస్, టీడీపీ పాలనలో తాగడానికి మంచినీళ్లు సరఫరా చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంటింటికీ తాగునీరు, వ్యవసాయానికి కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్ల ద్వారా సాగు నీరు అందుబాటులోకి తెచ్చారన్నారు. గజ్వేల్‌లో ఎడ్యుకేషన్ హబ్‌లు, అద్భుతమైన రహదారులు, ప్రభుత్వ భవనాలు, ఆడిటోరియాలు, కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అన్ని ప్రజలకు అందుతున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గజ్వేల్‌లో రేక్ పాయింట్ ఏర్పాటుతో సనత్‌నగర్ రేక్ పాయింట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలకు గజ్వేల్ నుంచే ఎరువులు సరఫరా అవుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ గజ్వేల్‌కు ప్రాతినిథ్యం వహి ంచడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమేనన్నారు.
సీఎం కేసీఆర్ లేకపోతే ఇంతగొప్ప అభివృద్ధి ఇక్కడ జరిగేది కాదన్నారు. 70ఏండ్లలో గజ్వేల్ నుంచి ప్రాతినిథ్యం వహించిన గీతారెడ్డి, సంజీవరావు, నర్సారెడ్డి, ఇతర నాయకులెవ్వరూ మంచినీళ్లు ఇవ్వలేకపోయారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధి నిరోధకులుగా మారారని, బీజేపీ తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకి అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బెజుగామలో సర్పంచ్ అండాలు, ఎంపీటీసీ గంగాధర్, నాయకుడు మహిపాల్‌రెడ్డి కోరిక మేరకు రావి చెరువుకు బతుకమ్మ మెట్లు నిర్మించడంతో పాటు 11కేవీ విద్యుత్ లైను మార్పులు, మురుగు కాల్వల నిర్మా ణ పనులకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, డాక్టర్ యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి. డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, డీసీఎంఎస్, డీసీసీబీ డైరెక్టర్లు వెంకటేశంగౌడ్, అంజిరెడ్డి, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, వైస్ ఎంపీపీ ్దకృష్ణగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, పట్టణాధ్యక్షుడు నవాజ్‌మీరా, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీ రవీందర్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
కొత్త పింఛన్‌దారుల ఆశీర్వాదం
ప్రజలందరికీ మేలు చేస్తున్న సీఎం కేసీఆర్ అందరూ ఆశీర్వదించాలని మంత్రి హరీశ్‌రావు గజ్వేల్ మహతి ఆడిటోరియంలో సభావేదిక పైనుంచి కోరారు. ఎంతమంది సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదిస్తారని ప్రశ్నించగా, అందరూ పైకి చేతులెత్తి తమ దీవెనలందించారు. దీంతో మంత్రి హరీశ్‌రావు, సభికులంతా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కొత్త పింఛన్ లబ్ధిదారులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. బెజుగామ,శేరిపల్లి పర్యటనలో భాగంగా అహ్మదీపూర్ చౌరస్తా వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. లబ్ధిదారులతో పాటు మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గజ్వేల్ నేతలు పాల్గొన్నారు.
ఊరిలోనే కిరాయి ఉంటున్నాం..
మాది పేద కుటుంబం. మొన్నటిదాకా పెంకుటిల్లు ఉండేది. అది కూడా ఆరునెలల కింద కూలిపోయిం ది. వేరే వాళ్ల ఇంట్లో కిరాయికి ఉంటున్నాము. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడం సం తోషంగా ఉన్నది. జీవితాంతం రుణపడి ఉంటాం.
– ఆంజనేయులు, కలవ్వ, బెజుగామ
సంతోషంగా ఉంది..
గవర్నమెంటు పింఛన్ మంజూరు చేయడం సం తోషంగా ఉంది. ముసలివారికి, ఒంటరివాళ్లకు ఇది ఎంతో ఆసరా ఇస్తుంది. నాకు మంజూరు కావడంతో సంతోషమనిపిస్తున్నది. అందరికీ మంచి చేస్తున్న సీఎం సారు బాగుండాలి. – పులకంటి భూలక్ష్మి