పటాన్చెరు, మార్చి 29 : గీతం హైదారాబాద్ బిజినెస్ స్కూల్, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ విద్యార్థులు విడివిడిగా ఫెషర్స్ పార్టీలను నిర్వహించుకున్నారు. మంగళవారం రుద్రారంలోని హైదరాబాద్ క్యాం పస్‌లో విద్యార్థులు సందడి చేశారు. రంగురంగుల వస్ర్తాలు, ఆటపాటలు, వెస్ట్రన్ డా న్స్‌లు డీజే మ్యూజిక్‌తో హోరెత్తించారు. కొత్త విద్యార్థులను ఆటపాటలతో ఆహ్వానించి స్నేహపూర్వక వాతావరణం సృష్టించారు. రోజంతా సాంస్కృతిక కార్యక్రమాలతో క్యాంపస్‌లో కొత్తజోష్ తెచ్చారు.