నిజాంపేట,మే11: బచ్చురాజ్పల్లిలో ఐకేపీకి చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసే విషయంలో మోసం జరుగుతుందని ఆదివారం స్థానిక రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా రైతు దుర్గోల్ల లింగం మాట్లాడుతూ 30 బస్తాలలోని వరి ధాన్యాన్ని తూకం వేస్తున్న క్రమంలో అనుమానం రాగా ధాన్యాన్ని మరలా తూకం వేయాలని కోరానని అప్పుడు ఒక్కొ బస్తాలో 1.5 కిలోల వరకు ధాన్యం వ్యత్యాసం వచ్చిందన్నారు.
ఇలా ఎంత మంది రైతులను మోసం చేస్తారంటూ నిర్వాహకులను ప్రశ్నించానని తెలిపారు. ఏది ఏమైనా కొనుగోలు కేంద్రం నిర్వాహణపై అధికారుల పర్యవేక్షణ కరువైందని, తూకం విషయంలో దోపిడీ పాల్పడ్డా వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు నరేందర్నాయక్, రాజు, పోచయ్య తదితర రైతులు ప్రభుత్వంను కోరారు.