నారాయణఖేడ్, డిసెంబర్ 8: ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లో ఉందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఆదివారం నారాయణఖేడ్‌లో సాయిబాబా ఫంక్షన్‌హాల్ లో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగారెడ్డి జిల్లా 6వ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను తప్పక పాటించాలన్నారు. కార్యక్రమానికి హాజరైన జహీరాబాద్ ఎంపీ సురేశ్‌శెట్కార్, స్థానిక ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నదని, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని తెలిపారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ య్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పలు నిర్ణయాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. పర్యవేక్షణ అధికారులు లేక విద్యారం గ అభివృద్ధ్దికి ఆటంకంగా మారిందన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి , రాష్ట్ర కార్యదర్శి జ్నానమంజరి , జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సాయిలు, జిల్లా ఉపాధ్యక్షుడు కాశీనాథ్, సువర్ణ, కోశాధికారి శ్రీనివాసరావు, నారాయణఖేడ్ డివిజన్ బాధ్యులు పాల్గొన్నారు.