హుస్నాబాద్, మే 16 : ఎన్నికలకు ముందు అబద్ధ్దపు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని తీరా గెలిచాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. గురువారం హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతుల ఆధ్వర్యంలో నిరసన, ధర్నా నిర్వహించారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు హోరెత్తాయి.
ఈ సందర్భంగా సతీశ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల హామీ లో అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అనంతరం మాట మార్చి రైతుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ ధుసూదన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వ ర్, నాయకులు తిరుపతిరెడ్డి, ఆకుల వెంకట్, మల్లికార్జున్‌రెడ్డి, భాగ్యరెడ్డి, బొజ్జ హరీశ్, సదానందం, బండి పుష్ప, నారాయణ, లక్ష్మణ్‌నాయక్, సతీశ్, శ్రీను, స్వరూప, రజని, రాజునాయక్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట, మే16 : రైతు ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి రైతుల పట్ల కపట ప్రేమ నటిస్తున్నారని నిన్నటితో తేటతెల్లమైందని బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, నాగిరెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సోమిరెడ్డి అన్నారు. సిద్దిపేట పట్టణంలోని అంబేదర్ చౌరస్తాలో నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎంపీపీలు కూర మణిక్యరెడ్డి, ఒగ్గు బాలకృష,్ణ చందర్ రావు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సంపత్‌రెడ్డి, ఎడ్ల సొమిరెడ్డి, జాప శ్రీకాంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎల్లం, ఎల్లయ్య, సంతోశ్, శ్రీనివాస్, భాస్కర్, ఎల్లారెడ్డి, మోహన్‌రెడి,్డ యాదయ్య, సారయ్య నాయకులు పాల్గొన్నారు.