నారాయణఖేడ్, ఆగస్టు 16: రుణమాఫీ, రైతుభరోసా, బియ్యానికి బోనస్ విషయంలో ఎన్నికల సందర్భంగా రైతులకిచ్చిన మాటను తప్పిన సీఎం రేవంత్ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ మంత్రి హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వం ప్రకిటించిన జాబితా ప్రకారం యాభైశాతం మందికి సైతం రుణమాఫీ జరగలేదని, ప్రజలను తప్పుదోమ పట్టించే విధంగా సీఎం రేవంత్ అబద్ధాలు ప్రచారం చేయడం దారుణమన్నారు. రైతుభరో సా, బియ్యానికి బోనస్ విషయంలోనూ రైతులను దగా చేసిన ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నదని నిలదీశారు. కేసీఆర్ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తే ప్రజలను మభ్య పెట్టేందుకు విడతల వారీగా మంత్రులు, ముఖ్యమంత్రి వెళ్లి ప్రారంభోత్సవం చేయడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమ ని, అయినా ప్రజలకు అన్ని విషయాలు తెలుసని, సరైన సమయవంలో సరైన రీతిలో స్పందిస్తారన్నా రు.
మాజీ మంత్రులు హరీశ్‌రావు, మాజీ సీఎం కేసీఆర్‌ల కాలిగోటికి సరిపోని సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపెద్ద మాటలు మాట్లాడంపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సీఎంగా కంటే ఎక్కువ బ్లాంక్ మెయిలర్‌గా, ఓటుకు నోట్టు కేసు లో నిందితుడిగానే ప్రజలకు తెలుసని, శునకాన్ని సింహాసనంపై కూర్చోబెట్టిన వెనకటి గుణం మానదన్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఇప్పటికైనా రౌడీభాష మానుకుని సీఎం రేవంత్‌రెడ్డి హుందాగా ఉండాలని హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అభిశేక్ శెట్కార్, ముజామిల్, విఠల్‌రావులు ఉన్నారు.