అందోల్, ఆగస్టు 22: కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే గ్రామాల్లో రుణమాఫీపై బహిరంగ చర్చ పెట్టాలని అం దోల్ మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సవాల్ విసిరారు. రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల సందర్భంగా రైతువేదికల్లో సంబురాలు చేశారో ఇప్పుడూ కూడా రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రతి రైతుకు రుణమాఫీ జరిగిందని ధైర్యంగా చెప్పే దమ్ము దా అని ప్రశ్నించారు.
గురువారం జోగిపేట వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించి వ్యవసాయ అధికారి శ్రీహరికి వినతిపత్రం అంజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తే పదవికీ రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించడంతో ఆగమేఘాల మీద రైతులకు రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించారు. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని విమర్శించారు.
అమలుకు సాధ్యంకానీ హామీలిచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, రాను న్న రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. అందోల్ ఎమ్మె ల్యే, ఆరోగ్య శాఖ మంత్రికి స్థానిక రైతుల సమస్యలు వారికి పట్ట వా అన్నారు. సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డి, నారాయణ, మాజీ ఎంపీపీ రామాగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగభూషణం, నాయకులు వెంకటేశం, వీరారెడ్డి, పార్టీ అధ్యక్షులు విజయ్‌కుమార్, విఠల్, శివకుమార్, నర్సింహులు, వీరప్ప పాల్గొన్నారు.