సిద్దిపేట, మార్చి 30: ఈద్-ఉల్-ఫితర్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమాసం దీక్షలు, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని పేరొన్నారు. లౌకికవాదం, మతసామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
అల్లా దయతో రాష్ట్ర ప్రజలంతా సుభీక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగను అధికారికంగా ప్రకటించిన ఘనత గులాబీ అధినేత కేసీఆర్‌కే దక్కిందన్నారు. యేటా పేద ముస్లింలకు రంజాన్‌తోఫా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. నెల రోజులు ముస్లింలు చేసిన ఉపవాస దీక్ష ఫలించి అల్లా దయతో రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు.