గజ్వేల్, మే 16: ప్రజలకు మంచి పాలనను అం దించడంలో సీఎం రేవంత్‌రెడ్డి అట్టర్‌ఫ్లాప్ అయ్యారని, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేశారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం చేపట్టిన ధర్నాలో రైతులనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలకు నష్ట మే తప్ప లాభం లేదన్నారు. రైతులకు, ప్రజల పక్షాన నిలబడేది కేసీఆర్ మాత్రమేనన్నారు.
త్వరలోనే గజ్వేల్ నియోజవర్గంలోని అన్ని మం డల కేంద్రాలు, రాజీవ్ రాహదారిపై రైతులతో పెద్ద ఎత్తున ధర్నా చేపడుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, పీఏసీఎస్ చైర్మన్ జెజాల వెంకటేశం గౌడ్, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అరుణ, కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, రజిత, కనకయ్య, రవీందర్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మద్ది రాజిరెడ్డి, గొడుగు స్వామి, స్వామిచారి, ఆకుల దేవేందర్, ఎల్లయ్య, బాల్‌రాజు, కొమురయ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు.