నేడు జననేత బర్త్‌డే
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించేందుకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గ కేం ద్రాల్లో జరిగే వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పా ల్గొననున్నారు.
- కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
- జిల్లా వ్యాప్తంగా సన్నద్ధమైన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు
సిద్దిపేట, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించేందుకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గ కేం ద్రాల్లో జరిగే వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పా ల్గొననున్నారు. ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, రక్తదాన శిబిరాలు, దవాఖానల్లో పండ్ల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. తెలంగాణ సాధించి పదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపిన నేత కేసీఆర్. తాగు, సాగునీటి రంగాలతో పాటు విద్య, వైద్యం తదితర రంగాల్లో దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దారు. తన పాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. నాణ్యమైన విద్యు త్, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలతోపాటు వృద్ధులు, దివ్యాంగులకు ఆసరా పింఛన్‌తో ఆదుకున్నారు. పేదింట కల్యాణలక్ష్మితో ఆ ఇంటిపెద్ద అన్నగా నిలిచారు.
అంతటి నాయకుడి పుట్టినరోజు వేడుకలను ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తం గా అన్ని గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించడానికి సబ్బండ వర్గాలు సిద్ధమయ్యా యి. ఎంత ఎదిగినా అంతే ఒదిగే స్వభా వం కలిగిన నేత కేసీఆర్. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తన చిన్ననాటి స్నేహితులతో పాటు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలను పేరుపెట్టి పిలిచే తత్వం ఆయనలో ఉంది. ఇలా ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించడంతో పాటు వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం ఆయనలో ఉన్న ప్రత్యేకత. కొన్నికొన్ని సందర్భాల్లో సమయం చిక్కినప్పుడు మిత్రుల ఇండ్లల్లో జరిగే శుభకార్యాలకు హాజరవుతూ వారితో ఉల్లాసంగా గడుపుతుంటారు. తన స్నేహితులతో కలిసి భోజనం చేయడం ఆనవాయితీగా మార్చుకున్నారు. అన్ని వర్గాలతో మమేకమై ఆప్యాయంగా ప్రేమాభిమానాలు పంచుతూ అందరివాడిగా నిలుస్తున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించి రాష్ర్టాన్ని సాధించి పదేండ్లు ముఖ్యమంత్రిగా పని చేసి అన్ని వర్గాల గుండెల్లో నిలిచారు.
కేసీఆర్‌కు చిన్నతనం నుంచే ఎంతో మేధాశక్తి
కేసీఆర్‌కు చిన్నతనం నుంచే ఎంతో మేధాశక్తి. పాఠశాల స్థాయిలో చిలిపి పనులు చేసిన అతడిలో చురుకుదనం కనిపించేదని కేసీఆర్ గురువులు చెబుతుంటారు. తెలుగు వ్యాకరణం, భాషపై పట్టుసాధించేలా కృషి చేసేవాడు. పదో తరగతి వరకు దుబ్బాక ఉన్నత పాఠశాలలోనే చదువుకున్నారు. విద్యా సంవత్సరం చివరి మూడు, నాలుగు నెలల ముందు ఇక్కడి నుంచి పుల్లూరు హైస్కూల్‌కు వెళ్లి అక్కడే పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. చింతమడక నుంచి రోజూ దుబ్బాక వరకు కాలినడకనే వెళ్లేవారు. తర్వాత కొన్ని రోజులకు చింతమడక గ్రామానికి చెందిన రాఘవరెడ్డి అనే హిందీ పండితుడు ఇదే పాఠశాలలో పని చేసేవాడు. ఆయన దుబ్బాకలోనే నివాసం ఉండటంతో సోదరి సుమతి, కేసీఆర్ కూడా వారి ఇంట్లోనే ఉండే వారు. పాఠశాలలో సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా పౌరాణిక నాటకాల్లో కూడా కేసీఆర్ పాత్రలు వేసేవారని అతడి మిత్రులు చెబుతుంటారు. శ్రీ కృష్ణపాండవీయం నాటకంలో పంచ పాండవుల్లో చివరివాడైన సహదేవుడి పాత్రను కేసీఆర్ పోషించాడని చెబుతారు. పాఠశాల విద్యార్థి సంఘం నాయకత్వానికి జరిగిన పోటీలో కూడా ఉపాధ్యక్షుడిగా కేసీఆర్ పని చేశాడు.
ఆయన విద్యార్థి దశలో ఒకటో తరగతి నుంచి రెండో తరగతి వరకు అంకంపేట, మూడో తరగతి చింతమడకలో, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు దుబ్బాకలో చదువుకున్నారు. అనంతరం సిద్దిపేటలో ఉన్నత విద్య అభ్యసించారు. కేసీఆర్ రైతుబిడ్డ ఎంత ఎదిగినా వ్యవసాయాన్ని మాత్రం ఏనాడూ వదల్లేదు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి కరువు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు సైతం చింతమడకలోనే స్వయంగా వ్యవసాయం చేశారు. రోజులో నాలుగైదు గంటల పాటు ట్రాక్టర్‌తో స్వయంగా పొలం దున్నేవారు. ఈ విషయాన్ని ఇప్పటికీ చింతమడక గ్రామస్తులు చెబుతుంటారు. వ్యవసాయమంటే సీఎం కేసీఆర్ ఎంతో మక్కువ. పదేండ్ల తన పాలనలో రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. రైతును రాజును చేయాలనే లక్ష్యంగా పని చేశారు. ఎక్కడో ఉన్న కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి ఈ ప్రాంత రైతుల సాగునీటి కష్టాలను తీర్చిన నేత కేసీఆర్.భూమికి బరువయ్యేలా రైతులు పంటలు పండించారు. ఇవాళ కేసీఆర్ చేపట్టిన పనుల వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి గుంట సాగులోకి వచ్చింది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

